సవాల్‌గా సర్పంచ్ ఎన్నికలు
చేవెళ్ల: సర్పంచ్ ఎన్నికలు నేతలకు సవాల్‌గా మారుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నా పార్టీలే తెరవెనుక ఉండి నడిపిస్తాయి. దీంతో ఇన్నాళ్లుగా పార్టీ నమ్ముకుని ఉన్నవారు కొందరికి అవకాశాలు రాక.. మరికొందరు తమ వ్యతిరేక వర్గం వారిని బలపరుస్తున్నారనే తదితర కారణాలతో పార్టీలు మారుతున్నారు. అభ్యర్థుల గెలుపును ప్రధాన పార్టీల నాయకులు భుజానెత్తుకుని పోటాపోటీగా ప్రచారాలు చేయిస్తున్నారు. మండల పరిధిలోని ముడిమ్యాలలో ఈ పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. తాజాగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు బూర్ల సాయినాథ్ కాంగ్రెస్‌ను వీడి మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో శనివారం మాజీ ఉపసర్పంచ్ షేక్ ఆరీఫ్ కారు దిగి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, పి.ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు.
పోటాపోటీగా పార్టీలు మారుతున్న నాయకులు


