చదువుకు దూరమై.. మనస్తాపానికి గురై
ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
పహాడీషరీఫ్: కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా పైచదువులు చదవలేకపోతున్నానని మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్ కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం ఎర్రకుంటలోని తూర్ కాలనీకి వలస వచ్చి ఆటోడ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. అతని కూతురు ఇఫ్రా ఖానమ్(19) గతేడాది 10వ తరగతి నాందేడ్‌లోని చదివింది. ఇంటర్ చదివేందుకు ఏడు నెలల క్రితం ఇక్కడికి వచ్చింది. వీరి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో అక్కడ రూ.4 వేలు చెల్లించి టీసీ తీసుకురాకపోవడంతో పాటు ఇక్కడ కాలేజీలో కూడా చేర్పించలేకపోయారు. ఈ విషయమై ఖానమ్ తీవ్ర వేదనకు గురవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం తల్లి సోదరులకు టిఫిన్ ఇచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఖానమ్ ఇంటి రేకుల పైప్‌నకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అనంతరం గమనించిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లివి కేఫ్, కిచెన్ ప్రారంభం
శంకర్‌పల్లి: మండలంలోని మోకిలతండాలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘లివి కేఫ్, కిచెన్’ను గురువారం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, శాసన సభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రారంభించారు. అనంతరం కేఫ్ నిర్వాహకుడు ప్రశాంత్ అతిథులను ఘనంగా సన్మానించారు. బీఆర్‌ఎస్ నేతలతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ శంకర్‌పల్లి అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, రాజునాయక్ పాల్గొన్నారు.
పేలిపోయిన వాషింగ్ మిషన్
అమీర్‌పేట: అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని ఓ ఇంట్లో ఎల్‌జీ వాషింగ్ మిషన్ పేలిపోయింది.పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేకే ఎన్‌క్లేవ్ ఫ్లాట్ నెం.503లో గురువారం మధ్యాహ్నం ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ నడుస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వాషింగ్ మిషిన్ పేలిపోయింది. ఈ సమయంలో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. తేరుకుని బాల్‌కానీలోనిలోకి వచ్చి చూడగా వాషింగ్ మిషిన్ ఎక్కడికక్కడ విరిగి పోయి విడిబాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. లోపలి పేలుడు ధాటికి లోపల అత్యంత బరువుగా ఉన్న బ్యాటరీ సీలింగ్ తగిలి కింద పడిపోయింది.పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డామని మహిళ వాపోయింది. షార్ట్‌సర్క్యూట్ జరిగి కరెంటు వైర్లు కాలిపోతే ఇంట్లో అంతటా మంటలు వ్యాపించి కాలిబూడిదయ్యేదని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియరాలేదని,బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐబొమ్మ రవిని నిర్దోషిగా బయటకు తెస్తా
హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు
హిమాయత్‌నగర్ : మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు అన్నారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే జైలు నుండి బెయిల్‌పై విడుదల చేయిస్తానని అన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లే అని తెలిపారు.
చదువుకు దూరమై.. మనస్తాపానికి గురై
చదువుకు దూరమై.. మనస్తాపానికి గురై


