అయోధ్య ఆలయానికి మిథాని తయారు చేసిన కిటికీలు
సంతోష్‌నగర్: కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థలో తయారైన భారతదేశపు తొలి టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిధాని అధికారులు తెలిపారు. మిధాని సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా వ్యూహాత్మక అనువర్తనాల కోసం టైటానియం మిశ్రమాలు సరఫరా చేస్తున్నప్పటికీ.. నిర్మాణ రంగంలో టైటానియం వినియోగం మొదటిసారన్నారు. వారసత్వ స్మారక కట్టడంలో నిర్మాణ పదార్థంగా టైటానియంను అమర్చిన భారతదేశపు తొలి సంస్థగా మిధాని నిలిచిందన్నారు. ఆలయ సముదాయంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం తయారు చేసిన టైటానియం 31 కీటికీలను తయారు చేసి సరఫరా చేశామన్నారు.


