దొంగల బీభత్సం
ఇబ్రహీంపట్నం రూరల్: దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదిబట్ల ఠాణా పరిధిలో బుధవారం గుర్తు తెలియని దుండగులు రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోనలి బొంగ్లూర్ రాఘవేంద్ర హోమ్స్‌లో మాడ్గుల మండలం అన్నబోయినపల్లికి చెందిన ఆమనగంటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం వారు వనస్థలిపురంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన పెద్ద కూతురు రిషిత ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేసిఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. బెడ్రూంలోని దాచిన ఏడు తులాల బంగారు నెక్లెస్, రెండు తులాల బంగారు చైన్లు, ఐదు గ్రాముల బ్రాస్‌లెట్, కూతురును విదేశాలకు పంపేందుకు దాచిన రూ.6 లక్షల నగదు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎన్‌ఎస్‌ఆర్ నగర్‌లో..
ఎన్‌ఎస్‌ఆర్ నగర్‌లో ఓ ఇంటికి తాళం వేసి యజమానులు అమెరికా వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఎక్కడ ఏమి లభించకపోవడంతో ఇంట్లో ఉన్న వీదేశీ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.
రాఘవేంద్ర హోమ్స్‌లో 9.5 తులాల
బంగారు ఆభరణాలు, రూ.6లక్షల నగదు, ఓ ల్యాప్‌టాప్ అపహరణ
ఎన్‌ఎస్‌ఆర్ నగర్‌లో
విదేశీ మద్యం బాటిళ్లు


