ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు పని చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని వైఎన్నార్ గార్డెన్స్‌లో సోమవారం బాటసింగారం సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన 57వ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్మే మల్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘం పరిధిలోని రైతులకు కావాల్సిన సమయంలో రుణాలను అందించేందుకు సంఘం పాలకవర్గం, సిబ్బంది ముందుకు రావాలన్నారు. తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు.
రుణాలను వసూళ్లు చేసే క్రమంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంఘం జమా ఖర్చులు, ఆడిట్ వివరాల నివేదికను సంఘం మేనేజర్ ఐలేష్‌యాదవ్ సభ్యులకు వివరించారు. సంఘం ద్వారా రుణాలు తీసుకుని సక్రమంగా వాయిదాలు చెల్లించిన 21 మంది రైతులను అభినందిస్తూ వారిని నగదుతో పాటు పురస్కారం అందించి సంఘం తరఫున సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, సంఘం వైస్‌చైర్మన్ నార్లకొండ మల్లమ్మ, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, యాదిరెడ్డి, బాల్‌రెడ్డి, నర్సింహ, బాలనర్సమ్మ, లక్షమ్మ, రాములు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.


