కోడిపందేల స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి
● 14 మంది అరెస్ట్
● నాలుగు కార్లు, 13 మొబైల్స్, 22 కోళ్లు, 18 కోడి కత్తులు స్వాధీనం
మొయినాబాద్ రూరల్: ఓ ఫాంహౌస్‌లో కోడి పందేలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. శనివారం రాత్రి మండల పరిధిలోని బాకారం సమీపంలో ఓ ఫాంహౌస్‌లో రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణం రాజు పాటు మరో 14 మందిని అరెస్ట్ చేశారు. నాలుగు కార్లు, 13 మొబైల్ ఫోన్స్, రూ.60,950 నగదు, 22 కోళ్లు, 18 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై మొయినాబాద్ పోలీసులను వివ రణ కోరగా వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్
వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ నియమితులయ్యారు. శనివారం ఏఐసీసీ విడుదల చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ఆయనకు చోటు లభించింది. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన గతంలో పలుమార్లు పెద్దేముల్ ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన భార్య తారాబాయి పెద్దేముల్ సర్పంచ్‌గా పనిచేశారు. 1988లో పెద్దేముల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పని చేశారు. 1995లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2001లో జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2012లో ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. డీసీసీబీ డైరక్టర్‌గా పనిచేశారు. 2019లో జెడ్పీటీసీగా గెలుపొందారు. 2022 నుంచి ఇప్పటి వరకు పీసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జెడ్పీటీసీ సభ్యుల్లో ఆయనొక్కరే గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
మహిళల సంక్షేమమే లక్ష్యం
నవాబుపేట: అర్హులైన ప్రతి మహిళకూ ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం నవాబుపేట ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిర రాజ్యంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోడిపందేల స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి


