సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
చేవెళ్ల: ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుందని.. ఇందుకు నిదర్శనం నేషనల్ హైవే–163 విస్తరణ పనులేనని చేవెళ్ల, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్–బీజాపూర్ హైవే విస్తరణ పనులపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2015లో రోడ్డు మంజూరుకు నిధులు మంజూరైనా గత పాలకుల నిర్లక్ష్యం, గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల కారణంగా ఆలస్యమైందని చెప్పారు. ఈ రోడ్డు దుస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎన్‌హెచ్‌ఏ అధికారులు, పర్యవరణ హితులతో చర్చించి ఎన్‌జీటీ కేసు విత్‌డ్రా చేయించారన్నారు. రెండు రోజులకే మీర్జాగూడ బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఈ రోడ్డు అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓఆర్‌ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు అనుసంధానంగా రూ.50వేల కోట్లతో కొత్త రోడ్లు అభివృద్ధి కానున్నాయన్నారు. రూ.450 కోట్లతో నూతన రైల్వే లైన్ రానుందని చెప్పారు. మరుగున పడిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఉమ్మడి జిల్లాకు సాగునీరును అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కత్వాల్‌గూడ–కొండగల్ వరకు ఇండస్ట్రియల్‌పార్కు వరకు కొత్తగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలకు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని చెప్పారు. పోలీస్ అకాడమి నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రోడ్డుపై చేవెళ్ల, మొయినాబాద్‌లో రెండు బైపాస్‌తో పాటు 15 అండర్‌పాస్‌లు నిర్మించనున్నట్లు చెప్పారు. ఏడాదిలోనే పనులు పూర్తి చేసందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చింపుల సత్యనారాయణరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, పెంటయ్యగౌడ్, వీరేందర్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీకాంత్, ఆగిరెడ్డి, రాములు, మల్లేశ్, సురేందర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, పాండు, నరేందర్, శ్రీనివాస్, మల్లేశ్, భీమయ్య, తదితరులు ఉన్నారు.
హైదరాబాద్–బీజాపూర్ హైవే విస్తరణ పనులు వేగిరం
‘ప్రాణహిత–చేవెళ్ల’ అభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి


