మర్రి చెట్టును ఢీకొట్టిన టిప్పర్
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ ర హదారిపై అదుపుతప్పి ఓ టిప్పర్ మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ బస్ స్టేజీ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైవే రోడ్డు పనుల కోసం మట్టిని తీసుకువస్తున్న టిప్పర్ వికారాబాద్ వైపు నుంచి చేవెళ్లకు వస్తుంది. ఖానాపూర్ బస్‌స్టేజీ వద్దకు రాగానే టిప్పర్ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును తప్పించబోయి పక్కకు మలపడంతో అదుపుతప్పి మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ వడ్డె శ్రీరామ్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు జేసీబీ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


