ఉత్సాహంగా ఇంటర్ స్కూల్ పోటీలు
హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ ఇంటర్ స్కూల్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు జిమ్నాస్టిక్, స్కేటింగ్, స్విమ్మింగ్, కరాటే, చెస్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు మహేశ్వర్, వెంకటేశ్, ప్రియాంక సాగర్ తదితరులు పాల్గొన్నారు.


