కనుల పండువగా రథోత్సవం
కడ్తాల్: భక్త జన సందోహం నడుమ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఆలయంలో విశేషపూజలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణతో పాటు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సహస్ర చండీయాగం వైభవంగా నిర్వహించారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఆల య నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకు ండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మా ర్కెట్ చైర్ పర్సన్ యాట గీత, ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, తహసీల్దార్ జ్యోతి, ఆలయ నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, యాదగిరి, కృష్ణ, శ్రీరాములు, చంద్రయ్య, శ్రీనివా స్, విజయ్, అర్చక సిబ్బంది అమూల్యపతి, సంతోష్‌శర్మ, భాను ప్రకాశ్‌శర్మ పాల్గొన్నారు.
కనుల పండువగా రథోత్సవం
కనుల పండువగా రథోత్సవం


