ఆశీర్వదించి గెలిపిస్తే అండగా ఉంటా | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించి గెలిపిస్తే అండగా ఉంటా

Published Sat, Nov 11 2023 4:26 AM

ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి  - Sakshi

షాద్‌నగర్‌ ఏఎఫ్‌బీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి

షాద్‌నగర్‌రూరల్‌: రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిలా ఉంటానని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని సాయిబాలాజీ టౌన్‌షిప్‌ నుంచి ముఖ్యకూడలి వరకు పార్టీ సింహం గుర్తుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పట్టణ సమీపంలో వేలాది మందితో సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టి పోయాయని, ప్రజల ఆకాంక్ష ఒకలా ఉంటే నాయకుల ఆలోచన మరో విధంగా ఉందని అన్నారు. రాజకీ ప్రక్షళనతోనే మార్పులు సాధ్యమని, ఆమార్పు మీ చేతుల్లోనే ఉందన్నారు. న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో తాను న్యాయం, ధర్మంవైపు పోరాడుతున్నానని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో న్యాయం, ధర్మమే గెలుస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సింహం గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌సింగ్‌, విజయభాస్కర్‌, నర్సింహయాదవ్‌, మల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, ఆకుల ప్రదీప్‌, చేగు సుధాకర్‌, ఇస్నాతి శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, లష్కర్‌నాయక్‌, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement