రూ.6.04 లక్షలకు ఇసుక వేలం | - | Sakshi
Sakshi News home page

రూ.6.04 లక్షలకు ఇసుక వేలం

Jun 16 2026 11:52 PM | Updated on Jun 16 2026 11:52 PM

జమ్మికుంట(హుజూరాబాద్‌): అక్రమార్కులు మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి మండలంలోని విలాసాగర్‌ గ్రామంలో డంపులు ఏ ర్పాటు చేసుకోగా, కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకున్న విషయం తెలిసిందే. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను మంగళవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. విలాసాగర్‌ గ్రామానికి చెందిన 15 మంది వేలంలో పాల్గొనగా ముంజల చక్రపాణి 120 ట్రాక్టర్‌ టిప్పులకు రూ.6,04,000 పాటతో దక్కించుకున్నారు. ఆర్‌ఐ శంకర్‌, సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement