తడిసిన ధాన్యాన్ని చూపుతున్న ఇతను బిలవేణి గంగ మల్లయ్య. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గంగ మల్లయ్య నాలుగు ఎకరాల్లో వరిపంట వేశాడు. పది రోజుల కిందట పంట కోసి వడ్లను మార్కెట్ యార్డులో పోశాడు. బుధవారం కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి. మరో రెండు రోజుల్లో అమ్ముకుందామని గంగ మల్లయ్య ఆశతో ఉండగా.. అకాల వర్షాలు ఆయన ఆశలను ఆవిరి చేశాయి.
ఇది కోనరావుపేట మండలం గోవిందరావుపల్లెలోని వడ్ల కల్లం. గిరిజన రైతులు తమ ధాన్యాన్ని ఇక్కడే ఆరబోసుకున్నారు. తుపాన్‌తో గ్రామపంచాయతీ ఆఫీస్ ఎదుట కల్లాల్లో పోసిన వడ్ల రాసులు నీటి మునిగాయి. వరద నీటిని తొలగించేందుకు రైతులు జేసీబీ సాయంతో కాల్వలు తవ్వుతున్నారు.
ముంచిన మోంథా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
