అన్ని విద్యాలయాల్లో ఫుడ్‌ టెస్ట్‌ అధికారి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని విద్యాలయాల్లో ఫుడ్‌ టెస్ట్‌ అధికారి ఉండాలి

Oct 31 2025 7:24 AM | Updated on Oct 31 2025 7:24 AM

అన్ని విద్యాలయాల్లో ఫుడ్‌ టెస్ట్‌ అధికారి ఉండాలి

అన్ని విద్యాలయాల్లో ఫుడ్‌ టెస్ట్‌ అధికారి ఉండాలి

● ఆహార పదార్థాలు బాగా లేకుంటే వాపస్‌ చేయాలి ● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● ఆహార పదార్థాలు బాగా లేకుంటే వాపస్‌ చేయాలి ● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో ఫుడ్‌ టెస్ట్‌ అధికారిని నియమించా లని, వారు ఆహారాన్ని రుచి సూచిన తరువాతే పిల్లలకు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆ దేశించారు. కలెక్టరేట్‌లో గురువారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈఎంఆర్‌ఎస్‌ గురుకులాల డీసీవోలు, జీసీడీవో, డీఈవోలతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ సరఫరా చేసే సరుకులు బాగా లేకుంటే వాపస్‌ చేయాలన్నారు. డైనింగ్‌హాళ్లలో మెనూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని, శుభ్రమైన మంచినీరు అందించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అన్‌ అకాడమీ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయా అని ఆరా తీశారు. డీఈవో వినోద్‌కుమార్‌, డిప్యూటీ డీఈవో లక్ష్మీరాజం, డీసీ వోలు రవీందర్‌రెడ్డి, సౌజన్య, భార తి, జీసీడీవో పద్మజ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లను పర్యవేక్షించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 7,918 ఇండ్లు మంజూరుచేయగా 5,361 ఇండ్లకు ముగ్గుపోశారని, 2,042 బేస్‌ మెంట్‌ లెవెల్‌, 1,011 గోడల లెవెల్‌, 962 స్లాబ్‌ లెవెల్‌లో ఉండగా, 8 ఇండ్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులకు రూ.49.85కోట్లు జమైనట్లు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, హౌసింగ్‌ పీడీ శంకర్‌ పాల్గొన్నారు.

అందుబాటులో ఉండాలి

వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రానీయొద్దన్నారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఏవో అఫ్జల్‌బేగం, డీసీవో రామకృష్ణ, డీఐవో కిశోర్‌కుమార్‌, డీఐఈవో శ్రీనివాస్‌, సీపీవో మల్లేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement