‘సెస్‌’ చైర్మన్‌పై అవిశ్వాసం! | - | Sakshi
Sakshi News home page

‘సెస్‌’ చైర్మన్‌పై అవిశ్వాసం!

Oct 11 2025 6:06 AM | Updated on Oct 11 2025 6:06 AM

‘సెస్‌’ చైర్మన్‌పై అవిశ్వాసం!

‘సెస్‌’ చైర్మన్‌పై అవిశ్వాసం!

● ఇటీవల రూ.50లక్షలతో మెటీరియల్‌ కొనుగోలుకు టెండర్లు పిలువగా.. కేవలం రూ.32లక్షల మెటీరియల్‌ కొనుగోలు చేసి నిలిపివేశారు. ఇందులో లావాదేవీలపై అనేక అరోపణలు ఉన్నాయి. ● జిల్లాలో 2500 ఎర్త్‌ పైపులను ఎన్‌పీడీసీఎల్‌ పర్ఛేజ్‌ ఆర్డర్‌ ప్రకారం అదే కాంట్రాక్టర్‌ ద్వారా పాలకవర్గం తీర్మాణం మేరకు ఆర్డర్లు ఇచ్చారు. కానీ 1258 ఎర్త్‌ పైపుల సరఫరా జరిగిన తర్వాత ఈ పైపుల సరఫరా ఆర్డర్‌ను నిలిపేశారు. దీనిలో పర్సంటేజీల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో సరఫరా ఆర్డర్‌ నిలిపి వేశారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఒక్క స్తంభం, కేబుల్‌ కేటాయింపుల్లో డైరెక్టర్ల మాట వినకుండా చైర్మన్‌ అన్ని మండలాల ఏఈఈలను, ఏడీఈలను, డీఈఈలను గుప్పింట్లో పెట్టుకోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో అవిశ్వాసానికి తెర లేచింది. ● రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో విద్యుత్‌ సరఫరా పరంగా ఏ పని కావాలన్నా.. చైర్మన్‌ అనుమతి లేకుండా చేయవద్దని కట్టడిచేయడంతో మెజార్టీ డైరెక్టర్లు ఆయనపై అవిశ్వాసానికి తెర లేపినట్లు భావిస్తున్నారు.

పావులు కదుపుతున్న డైరెక్టర్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కలిసిన అసమ్మతి నేతలు

సిరిసిల్ల: రాష్ట్రంలోనే ఏకై క సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) చైర్మన్‌ చిక్కాల రామారావుపై అవిశ్వాసానికి తెరలేసింది. మెజార్టీ ‘సెస్‌’ డైరెక్టర్లు రామారావుపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించి కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవాలని చూస్తున్నారు. ఈమేరకు మెజార్టీ డైరెక్టర్లు ఒక్కటైనట్లు భావిస్తున్నారు. ‘సెస్‌’ సంస్థ ఐదు దశాబ్దాల క్రితం చీకట్లో మగ్గిన పల్లెలకు విద్యుత్‌ వెలుగులనిచ్చింది. బీడు భూములను తడిపేందుకు కరెంట్‌ తీగలను అందించింది. కాళ్లు, చేతులు ఆడిస్తూ నడిపే చేనేత మగ్గాలకు కరెంట్‌ మోటారై పవర్‌లూమ్‌ అయింది. దేశంలోనే సహకార రంగంలో విద్యుత్‌ను పంపిణీ చేసే ప్రతిష్ఠాత్మకమైన సంస్థగా ప్రపంచ గుర్తింపు పొందింది. అనేక దేశాల విద్యుత్‌ రంగ నిపుణులు సిరిసిల్ల ‘సెస్‌’పై అధ్యయనం చేశారు. సిరిసిల్ల ‘సెస్‌’ చైర్మన్‌ చిక్కాల రామారావుపై అవిశ్వాసాన్ని ప్రతిపాతిదించేందుకు రంగం సిద్ధమైంది.

అవిశ్వాసానికి కారణాలివీ..

కేటీఆర్‌ దృష్టికి అవిశ్వాసం

‘సెస్‌’ చైర్మన్‌ చిక్కాల రామారావుపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించే అంశాన్ని మెజార్టీ డైరెక్టర్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముగ్గురు డైరెక్టర్లు రామారావుపై అవిశ్వాసాన్ని డిసెంబర్‌ నెలలో ప్రతిపాదించి ఆయనను పదవి నుంచి తొలగించాలని చూస్తున్నట్లు తెలిసింది. చైర్మన్‌ను స్థానాన్ని దక్కించుకునేందుకు ముగ్గురు నేతలు ఒకే తాటిపై ఉండి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్ఠికి తీసుకెళ్లగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తర్వాత చూద్దామని చెప్పినట్లు తెలిసింది. అవిశ్వాసానికి మరో రెండు నెలలు సమయం ఉండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మెజార్టీ నేతలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement