
కాచి చల్లార్చిన నీటిని తాగాలి
సిరిసిల్ల: వర్షాల నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, గొల్లపల్లి ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంగళవారం డ్రై డే నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జ్వరపీడితులను గుర్తించి చికిత్స అందించాలన్నారు. ఇళ్లలోని డ్రమ్ములు, కుండీలు, తొట్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
రెండు డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
జిల్లాలో రెండు డాక్టర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారని జిల్లా వైద్యధికారి ఎస్.రజిత మంగళవారం తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ స్కీం(ఎన్‌హెచ్‌ఎంఎస్)లో గైనకాలజిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 5లోగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో దరఖాస్తు చేయాలని కోరారు. గైనకాలజిస్ట్‌కు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌కు రూ.50వేలు జీతం ఉంటుందని తెలిపారు.