అతివలకు రెడీమేడ్‌ ఉపాధి | - | Sakshi
Sakshi News home page

అతివలకు రెడీమేడ్‌ ఉపాధి

Apr 10 2025 12:27 AM | Updated on Apr 10 2025 12:27 AM

అతివల

అతివలకు రెడీమేడ్‌ ఉపాధి

● రేపు అపెరల్‌ పార్క్‌లో టెక్స్‌ఫోర్ట్‌ యూనిట్‌ ప్రారంభం ● హాజరవుతున్న నలుగురు మంత్రులు ● ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల: సిరిసిల్ల ప్రాంతంలోని మహిళలకు శాశ్వత ఉపాధిని అందించేందుకు ఆధునిక వస్త్రాల తయారీ యూనిట్‌ సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూరు అపెరల్‌ పార్క్‌లో రెడీమేడ్‌ వస్త్రాల తయారీసంస్థ టెక్స్‌ఫోర్ట్‌ కంపెనీ యూనిట్‌ను శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, చేనేత, జౌళిశాఖ జేడీ ఎన్‌.వెంకటేశ్వర్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెక్స్‌ఫోర్ట్‌ కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు.

రెండు వేల మందికి ఉపాధి

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రెండు వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో టెక్స్‌ఫోర్ట్‌ కంపెనీ ముందుకొచ్చింది. రెండు ఎకరాల్లో టెక్స్‌ఫోర్ట్‌ గార్మెంట్‌ యూనిట్‌ను నిర్మించారు. అపెరల్‌ పార్క్‌లో ఇప్పటికే గోకుల్‌దాస్‌ ఇమేజెస్‌ గార్మెంట్‌ సంస్థ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించే దిశగా ఆ కంపెనీ యూనిట్‌ను విస్తరిస్తోంది. గోకుల్‌దాస్‌ సంస్థలో లోదుస్తులను తయారీచేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సిరిసిల్ల నుంచి నేరుగా అమెరికాకు వస్త్రాలు వెళ్తున్నాయి. ఇప్పుడు టెక్స్‌ఫోర్ట్‌ అనే మరో అంతర్జాతీయ సంస్థ సిరిసిల్లలో పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడంతో 1600 మంది మహిళలు, మరో 400 మంది స్టాఫ్‌కు ఉపాధి లభించనుంది. శుక్రవారం టెక్స్‌ఫోర్ట్‌ యూనిట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధునిక జీన్స్‌, టీషర్ట్‌, అండర్‌వేర్స్‌ కుట్టుపై మహిళలకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు.

అతివలకు రెడీమేడ్‌ ఉపాధి1
1/2

అతివలకు రెడీమేడ్‌ ఉపాధి

అతివలకు రెడీమేడ్‌ ఉపాధి2
2/2

అతివలకు రెడీమేడ్‌ ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement