
‘ట్రినిటి’ అద్భుత ఫలితాలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఈఏపీసెట్ 2024 ఫలితాల్లో ట్రినిటి జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాలల ఫౌండర్ చైర్మన్, పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన జె.హనికర్ అత్యుత్తమంగా 44వ ర్యాంక్ సాధించి సత్తా చాటినట్లు పేర్కొన్నారు. పి.ప్రణయ్ 773, వై.ఆశ్లేష 1254, వి.శ్రీతేజ 1255, వై.అశ్విత 1551, సీహెచ్ విఘ్నేశ్ 1624, అయేషా 1627, ఫిల్జా అతీక్ 1748, ఎస్.శ్రీలక్ష్మీ 2159, ఎం.హర్షవర్ధన్ 2280, ఎన్.గంగశ్రీ 2372, పి.శ్రీదీప 2682, సీహెచ్ రంజిత 2815, మదిహా ఫాతిమా 2913, ఎం.ఆశీష్ 2954, కె.రాణి 2998 ర్యాంకులను కై వసం చేసుకున్నట్లు తెలిపారు. 10వేల లోపు ర్యాంకులను చాలామంది విద్యార్థులు కై వసం చేసుకున్నారన్నారు. అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించారు. విద్యార్థులను కళాశాలల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డితోపాటు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.