VIjaya Sai Reddy Tweet On Eenadu Paper Over Misleading News - Sakshi
Sakshi News home page

కిలాడి డ్రామూ! జనం దేనితో నవ్వుతారో కూడా ఆలోచించవా?: విజయసాయిరెడ్డి

Nov 21 2022 3:22 PM | Updated on Nov 21 2022 4:37 PM

VIjaya Sai Reddy Tweet On Eenadu Paper Over Misleading News - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈనాడు పత్రికపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఈనాడులో అమరావతిని ఉద్ధేశిస్తూ ప్రచురితమైన వార్త క్లిప్‌న్‌ ట్విటర్‌లో షేర్‌ చూస్తూ ఎల్లోమీడియాపై విరుచుకుపడ్డారు. 

‘ఒరేయ్ కిలాడి డ్రామూ! అమరావతి ఆగిపోవడంతో రాష్ట్రంలో ప్రజలు పిల్లల్ని కనడం ఆపేశారా? నీ పేపర్ చూసి జనం దేనితో నవ్వుతారో కూడా ఆలోచించవా? నీలో పచ్చ కుల పైత్యం బాగా ముదిరిపోయింది. మోకాలికి బోడి గుండుకు లింక్ పెడుతూ గాలి వార్తలు రాయడానికి అలవాటు పడ్డావు.’ అని ట్వీట్‌ చేశారు.
చదవండి: అక్కడ చంద్రబాబు పోటీ చేసినా నేను రెడీ.. కొడాలి నాని సవాల్‌

మరో ట్వీట్‌లో ‘క్రికెట్ కూడా నీకు దందాలా కనిపిస్తోందా? క్రీడలపై నీ రాజకీయ క్రీనీడ ఏందిరా డ్రామూ? నిందితుడైనంత మాత్రాన పదవులు చేపట్టొద్దంటే మీ చంద్రం సీఎం కూడా కాలేకపోయేవాడు. మార్గదర్శి సహా నువ్వు కూడా చాలా కేసుల్లో క్రిమినల్‌వే కదా కులగజ్జి డ్రామూ! నీ నేరాలకు ఎప్పుడో నీకు ఉరి శిక్ష పడాలి’ అంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement