‘మీరు చేసిన తప్పలకు శిక్ష అనుభవించాల్సిందే’ | RK Roja Strong Warning To Minister Ramprasad Reddy | Sakshi
Sakshi News home page

‘మీరు చేసిన తప్పలకు శిక్ష అనుభవించాల్సిందే’

May 8 2026 10:40 PM | Updated on May 8 2026 10:40 PM

RK Roja Strong Warning To Minister Ramprasad Reddy

తిరుపతి:  ఏపీలో రెడ్‌బుక్‌ పాలన కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి రాజకీయం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత  దశరథరామిరెడ్డిపై రాంప్రసాద్‌రెడ్డి వర్గీయులు దాడి చేయడం అత్యంత హేయమన్నారు.  

ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్‌లో  టీడీపీ గుండాలు దాడిలో గాయపడిన రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామి రెడ్డిను  పరామర్శించిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా పరామర్శించారు.

రౌడీయిజం చేస్తారు అనే రామ్ ప్రసాద్ రెడ్డికు మంత్రి పదవి ఇచ్చారు, రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భూ దందాలు, రౌడీ ఇజం, గంజాయి అక్రమాలు పెరిగిపోయాయి. ఖచ్చితంగా మీరు చేసిన శిక్షకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దశరథ రామిరెడ్డి వైఎస్సార్‌సీపీలో ఉన్నారనీ మీరు దాడి చేశారు, 

దీనికి  శిక్ష అనుభవించక తప్పదు. అన్యాయంగా మనుషుల్ని వేటాడి, కొట్టి, హత్య చేసేందుకు కుట్ర చేశారు. రామ్‌ప్రసాద్‌రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోరు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా దాడి చేశారు. ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, లా అండ్ ఆర్డర్ పూర్తి గా ఫెయిల్యూర్  అయ్యింది’ అని విమర్శించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement