మాది పోరాటం.. వాళ్లది వావివరసలు లేని ఆరాటం: పేర్ని నాని | Ex Minister Perni Nani Comments TDP And Janasena | Sakshi
Sakshi News home page

మాది పోరాటం.. వాళ్లది వావివరసలు లేని ఆరాటం: పేర్ని నాని

Apr 25 2022 8:07 PM | Updated on Apr 25 2022 8:37 PM

Ex Minister Perni Nani Comments TDP And Janasena - Sakshi

వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్‌ కిశోర్‌ తమకు కన్సల్టెంట్‌ మాత్రమేనన్నారు.

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్‌ కిశోర్‌ తమకు కన్సల్టెంట్‌ మాత్రమేనన్నారు. టీడీపీ, జనసేన లాగా వావీ వరస లేకుండా పొత్తు పెట్టుకునే సిద్ధాంతం మాది కాదన్నారు. బీజేపీని తిట్టిన టీడీపీ, జనసేన ఆ పార్టీతోనే జత కట్టాయని దుయ్యబట్టారు. బీజేపీ ద్వారా పవన్‌ రాష్ట్రానికి ఏం సాధించారు అని ప్రశ్నించారు. ‘‘ఎవరైతే మాకు ప్రత్యేక హోదా ఇస్తారో.. వారికి మద్దతు పలికే విషయాన్ని ఆలోచిస్తామని’’ పేర్ని నాని అన్నారు.
చదవండి: ‘దత్తపుత్రుడు’ అట్టర్‌ ఫ్లాప్‌ ఖాయం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement