'హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని చంపేశారు'

AP Assembly Session Kannababu Discussion About  - Sakshi

సాక్షి, అమరావతి : నివర్ తుఫాన్ పంట నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శాసనమండలిలో మంగళవారం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పలు అంశాలపై మాట్లాడారు. ' రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. రైతులు విత్తనాలు పొందాలంటే గ్రామ సచివాలయంలో సంప్రదించవచ్చు. ఏ సీజన్‌లో పంట నష్టానికి సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీ అదే సీజన్‌లో ఇవ్వటం ఇకపై చరిత్రగా నిలిచిపోనుంది. రైతులను ఆదుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉంది. రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సహకార సంఘాన్ని కూడా ఆధునికరిస్తాం.

గత ప్రభుత్వం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది. హెరిటేజ్ డెయిరీ ఏ రోజైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి సహకార రంగం కుప్పకూలింది. హెరిటేజ్ డెయిరీ కోసమే చిత్తూరు డెయిరీని చంపేశారు. డెయిరీలను మాక్స్ యాక్ట్‌ నుంచి కంపెనీ యాక్ట్ ఎందుకు తీసుకువచ్చారనే దానిపై లోకేష్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు మేలు చేసేందుకు పాడి పరిశ్రమకు సంబంధించి అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్ తో రైతులకు లాభం చేకూరనుంది.(చదవండి : లోకేష్ ట్రాక్టర్ తీసుకెళ్లి పెద్ద యాక్షన్ చేశాడు)

రైతు ఆత్మహత్య చేసుకుంటే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ. 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు పెంచాం. గత ప్రభుత్వం చెల్లించని బకాయిలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాం. ఆర్‌బికే అనేది ఒక వినూత్నమైన ఆలోచన.. త్వరలో ఈ ప్లాట్ ఫామ్‌ను తీసుకొస్తాం.' అని కురసాల తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top