కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి
పెద్దపల్లి: సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూ పాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వెంకటరెడ్డి, డీసీపీ రాంరెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన కా ర్యక్రమాలో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని అన్నారు. తెల్లరేషన్ కార్డుదారులు ఆర్టీఐ దరఖాస్తుల కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చట్టం ప్రకారం దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, గడువు దాటితే ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. గడువులోగా సమాచారం ఇవ్వపోతే సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీ అధికారి ఆర్టీఐ చట్టంలోని అన్నినిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, అందిన ప్రతీదరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని, వివిధ శాఖల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రశేఖర్‌రెడ్డిని కలిసిన సీపీ
కోల్‌సిటీ: గోదావరిఖని ఇల్లెందు క్లబ్‌కు చేరుకున్న సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.


