వీర్నపల్లి(సిరిసిల్ల): వృద్ధురాలి కళ్లల్లో కారం చల్లి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శనివారం క లకలం రేపింది. బాధితురాలి కథనం ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీ ర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గుగులోతు హంసి శనివారం తెల్లవారుజాము న 5 గంటల సమయంలో తన ఇంటి బయట పనులు చేస్తుంది. ఇదే సమయంలో గుర్తు తె లియని వ్యక్తులు ఆమైపె దాడి చేసి, కళ్లలో కా రం చల్లి మెడలోని 2.5 తులాల బంగారు గొ లుసును లాక్కెళ్లారు. ఈ హఠాత్పరినామంతో హంసి గగ్గోలు పెట్టడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చినా దుండగులు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వేముల లక్ష్మణ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గంజాయి రవాణా చేస్తున్న గాజానవేణి రాకేశ్, అంబాల తరుణ్‌ను అరెస్టు చేసినట్లు పొత్కపల్లి ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆదేశాల మేరకు గుంపుల గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్, తరుణ్ బైక్‌పై అటుగా వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ఆగాలని సూచించడంతో అంతలోనే పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వారిని పట్టుకొని విచారించగా.. గంజాయి విక్రయించేందుకు అటుగా వచ్చినట్లు అంగీకరించారు. వారినుంచి గంజాయితో పాటు బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకొన్నారు.


