గోదావరిఖని: బొగ్గు గని కార్మికులకు 12వ వేజ్‌బో ర్డు కోసం జేబీసీసీఐ ఏర్పాటు చేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎంఎస్ 113వ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 9, 10వ తేదీల్లో ఒడిశాలోని తాల్చేర్ అంగుల్ ప్రాంతంలో నిర్వహించినట్లు తెలిపారు. కోల్ ఇండియా, సింగరే ణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అ మలు చేస్తున్నాయని, వీటిని ఉపసంహరించుకోవాలని సభ డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అధికారుల వేతన సవరణను నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే అమలు చేయడానికి యత్నించారని, కార్మికుల విషయంలో నోటిఫికేషన్ విడుదల చేయ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. నా యకులు యతిపతి సారంగపాణి, మాదాసి రవీంద ర్, ఆకుల హరిణ్, తాట్ల లక్ష్మయ్య, ఎల్లావుల కోట య్య, తుమ్మ గట్టయ్య, పుప్పాల నాగేంద్రప్రసాద్, సురేశ్, సమ్మయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


