పెద్దపల్లి: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూ లే ఆశయాలు, ఆలోచనలను అదరూ ఆచరించాల ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా వెనుకబ డిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివా రం కలెక్టరేట్‌లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు తో కలిసి కలెక్టర్.. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం క లెక్టర్ మాట్లాడుతూ, సమాజంలోని అసమానతల ను తొలగించడంలో పూలే చేసిన సేవలు అమోఘమన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని అన్నారు. అంతకుముందు పెద్దపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్, బీసీ సంఘాల నాయకులు సారయ్యగౌడ్, దాసరి ఉష, ఆకుల స్వామి వివేక్ పటేల్, శంకర్, కొండి సతీశ్, శ్రీమాన్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బాపయ్య తదితరులు పాల్గొన్నారు.
హౌస్‌లిస్టింగ్‌లో కచ్చితత్వం
జనగనణలో భాగంగా చేపట్టిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ల వివరాలు కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చే యాలన కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో చేపట్టిన జనగణన ప్రక్రియను శనివారం కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చే శారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల ఫిజికల్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి నిర్వహించాలన్నారు. ల్యాండ్‌మార్క్‌లు, పాఠశాలలు, దేవాలయాలు, కార్యాలయాలు తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసీల్దార్ విజయ్, అధికారులు పాల్గొన్నారు.


