ఓసీపీ–1లో సినిమా షూటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఓసీపీ–1లో సినిమా షూటింగ్‌

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

గోదావరిఖని: ఓసీపీ–1లో శుక్రవారం కోల్‌గోల్డ్‌ సి నిమా షూటింగ్‌ జరిగింది. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఓసీపీ–2లో, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేశారు.

హామీలు నెరవేర్చాలి

పెద్దపల్లి: ఆర్టిజన్‌ల సమ్మైపె ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఆర్టిజన్‌ కార్మికుల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జేఏసీ చైర్మన్‌ తూళ్ల నాగరాజు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులను చర్చలకు పిలిచి, హామీలు నేరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జేఏసీ కో కన్వీనర్‌ ఇ.ప్రసాద్‌, పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ ఎస్‌డీ కలీమొద్దీన్‌, ఎన్‌.సతీశ్‌రావు, ఎస్‌.రవి, ఎస్‌.నర్సింగం, సింగమల్ల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement