కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదు

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

● కేటీఆర్‌పై మంత్రి అడ్లూరి ధ్వజం

ధర్మారం: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎ స్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ప్రజలను, కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ విమర్శించారు. నందిమేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. కవులు, కళాకారులు, ప్రజలు తమ ప్రా ణాలను పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాడిన వారికి దక్కిన గౌరవం ఏమిటో తెలుసన్నారు. కేసీఆర్‌ కుటుంబంలోని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావుకు మాత్రమే స్వరాష్ట్రంలో రాజకీయ ఉద్యోగాలు లభించాయని అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉంటూ నేడు క్యాబినేట్‌ మంత్రి వరకు పార్టీ గుర్తింపు నిచ్చిందని ఆయన అన్నారు.

పేదలకు ఉచితవైద్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అత్యాధునిక వైద్యసేవలు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అన్నిగ్రామాల ప్ర జలకు అందుబాటులో ఉండేలా మేడారంలో ఆస్ప త్రి నిర్మించామన్నారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్‌తోపాటు వైద్య, ఆరోగ్య అధికారులు క్రమం తప్పకుండా ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలపై ఆరా తీయాలని సూచించారు. ఈసందర్భంగా ఆస్పత్రి స్థలదాత పొనుగోటి నర్సింగరావును మంత్రి శాలువాతో సన్మానించారు. అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే తపనతో 1968లో సర్పంచ్‌గా కొనసాగిన తన తండ్రి మురళీధర్‌రావు నాలుగు ఎకరాలను ఆస్పత్రి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారన్నారు. సర్పంచ్‌ మ్యాడా రం వీర్‌పాల్‌, ఉపసర్పంచ్‌ రవి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, వైస్‌ చైర్మన్‌ అరిగే లింగయ్య, జిల్లా వైద్యాధికారి ప్రమో ద్‌కుమార్‌, సూపరెండెంట్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement