పెద్దపల్లి: జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు ఈనెల 13 నుంచి మొబైల్‌ఫోన్లు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే ఫోన్లు జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరాయి. గత ప్రభుత్వం 3–జీ మొబైల్‌ఫోన్లను పంపిణీ చేసింది. అవి ఇప్పు డు పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. ఈమేరకు 5జీ, ఎయిర్‌ఫోన్స్, డాటా కేబుల్, పౌచ్, సిమ్ కా ర్డులు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, టీచర్లు 706 మంది ఉండాలి. ఇందులో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ, అంగన్ వాడీ టీచర్లకు ఈనెల 13న మొబైల్‌ఫోన్లు పంపిణీ చేస్తామన్నారు.
17, 18వ తేదీల్లో మహాసభలు
పెద్దపల్లి : వరంగల్‌లో ఈనెల 17, 18వ తేదీల్లో దళిత హక్కుల పోరాట సమితి రెండో మహాసభలు నిర్వహిస్తామని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం ఆయన మహాసభ ప్రచార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడా రు. సభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు పేరుక లక్ష్మణ్, పేరుక సతీశ్, క్యాదాసి రాజు, మోల్గూరి కల్యాణ్, ఇంజపురి దేవదాస్, కల్వల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


