వారోత్సవాలను విజయవంతం చేయాలి
పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 13 నుంచి నిర్వహించే వయోవృద్ధుల వారోత్సవాలను వియవంతం చేయాలని అదనపు కలెక్టర్ వేణు కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం వారోత్సవాల ప్రచార పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వారోత్సవాల సందర్భంగా ఈనెల 13న వృద్ధాశ్రమంలో ఆట, పాటలు, వినోద కార్యక్రమా లు, 14న ఉచిత ఆరోగ్య శిబిరాలు, 15న సీనియర్ సిటిజన్స్ హక్కులపై అవగాహన ర్యాలీ లు, 17న జిల్లాస్థాయి వృద్ధుల చట్టాలపై ఆరో గ్య, చురుకై న వృద్ధాప్యంపై అవగాహన, 18న సర్పంచ్, ప్రతినిధులతో అవగాహన, 19న రా ష్ట్ర, జిల్లాస్థాయిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో అధికారులు కవిత, రాజ య్య, బాలస్వర్ణలత, స్వామి, జీవన్, రాజు, రాజేశం, సత్తయ్య, సుందరి పాల్గొన్నారు.
పనితీరుకు పురస్కారం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆ స్పత్రి అధికారులు, సిబ్బంది సేవల ఆధారంగా స్టార్ పెర్ఫార్మర్ అవార్డు ప్రదానం చేస్తున్న ట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనల మే రకు సిబ్బందిలో పారదర్శకత పెంచేందుకు ప్ర తీనెల పనితీరు ఆధారంగా ఒకరికి స్టార్ పెర్ఫార్మర్ అవార్డు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈసారి మౌనిక అనే స్టాఫ్‌నర్స్‌కు అవార్డు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఎంవో విజయ్‌కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు సభ్యత్వాలు
మంథని: మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పోతరవేని క్రాంతి ఆధ్వర్యంలో 32 మంది మత్స్య కార్మికులకు నూతన సభ్యత్వాలు, గుర్తింపు కార్డులను జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, జిల్లా అధికారి నరేశ్‌నాయుడు అందజేశారు. స్థానిక బోయిన్‌పేట్ లక్ష్మీదేవర ఆలయ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. మత్స్యకార రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం జిల్లాలో తొలిసారి సభ్యత్వాలు అందేలా కృషి చేసిన డైరెక్టర్, మంథని అధ్యక్షుడు పోతరవేని క్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మాజీ అధ్యక్షుడు పోతరవేని లక్ష్మీరాజం, డైరెక్టర్లు కుంట బద్రి, సిలివేరి భూమన్న బయ్యా రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు హుండీ ఆదాయం లెక్కింపు
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో వేసిన కట్న, కానుకల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. దేవాలయ ఆవరణలో గ్రామపెద్దలు, ఆలయ ధర్మకర్తలు, అధికారుల సమక్షంలో హుండీ ఆదాయం లెక్కింపు చేపడతామన్నారు. గ్రామస్తులు కూడా హాజరు కావాలని ఆయన కోరారు.
నేడు పత్తి మార్కెట్ బంద్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో గురువారం పత్తి క్రయ, విక్రయాలు నిలిపివేస్తున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప కుమారుడు అకాల మరణం పొందిన కారణంగా సంతాప సూచకంగా అడ్తీ, ఖరీదుదారులు కొనుగోళ్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతులు మార్కెట్‌కు పత్తి తేవద్దని ఆయన సూచించారు.
గడువు పొడిగింపు
పెద్దపల్లి: పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 27వ తేదీ వరకు పొడిగించామని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. డీఎంఎల్‌టీలో 30, డయాలసిస్‌లో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇంటర్ బైపీసీ విద్యార్థులు అర్హులన్నారు. వారు సరిపడాలేకుంటే ఎంపీసీ వారికి అవకాశం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
వారోత్సవాలను విజయవంతం చేయాలి
వారోత్సవాలను విజయవంతం చేయాలి


