
రైల్వే సేవలన్నీ ఒకే యాప్‌లో..
రామగుండం: ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ఒకేయాప్‌లో అన్నిసేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దానిని సూపర్ యాప్ ‘స్వరైల్’గా నామకరణం చేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్ మొబైళ్లు వినియోగించే వారు ఈ సేవలు పొందే వీలుంది. యాప్‌లో ఇకనుంచి ఐఆర్‌సీటీసీ, యూటీస్, రేల్ మదాద్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి వేర్వేరు సేవలను ‘స్వరైల్’ యాప్ ద్వారా పొందవచ్చు.
ప్రయాణికులకు అందే సేవలు..
● రిజర్వేషన్ టికెట్లు, టికెట్ బుకింగ్
● నాన్ రిజర్వ్, జనరల్ టికెట్లు (అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టం– యూటీఎస్ టికెట్లు)
● ప్లాట్‌ఫారం టికెట్లు (స్టేషన్‌లో ప్రవేశించడానికి)
● లైవ్ రన్నింగ్ స్టేటస్, షెడ్యూల్ సమాచారం
● క్యాటరింగ్, రైల్వేస్టేషన్లలో ఫుడ్ ఆర్డర్ అండ్ డెలివరీ
● రైల్ మద్దత్ (ఫిర్యాదుల పరిష్కారం, సపోర్ట్ సిస్టమ్)
● రిజర్వేషన్ చరిత్ర, ప్రయాణ విశ్లేషణ, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్ గేట్‌వేలు
సాంకేతిక సామర్థ్యం, రికార్డులు
● ప్రతీనిమిషానికి సగటున పది వేల టికెట్లు బుక్ చేసే సామర్థ్యం
● రోజూ 15 లక్షల టికెట్ల వరకు ప్రాసెస్ సౌకర్యం
● ఇతర యాప్‌ల కంటే రెండువేల రేట్లు వేగవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్
● ఏఐ ఆధారిత సిఫార్సులు, గత ప్రయాణాల ఆధారంగా రూట్లు, ట్రైన్లు సూచించడం
● మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా పలు భాషల్లో యాప్ అందుబాటులో ఉంది.
● ఈ యాప్ ఇండియాలో అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్‌ఫామ్
యాప్ వినియోగించడం ఇలా..
● గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి
● ‘స్వరైల్ బై ఐఆర్‌సీటీసీ’ అని సెర్చ్ చేయాలి
● డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ చేసుకొని వినియోగించడమే తరువాయి.