
బీపీని నియంత్రిస్తేనే ఆరోగ్యం
పెద్దపల్లిరూరల్: రక్తపోటు(బీపీ)ని నియంత్రిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువకాలం జీవిస్తారని డీఎంహెచ్‌వో పమోద్‌కుమార్ అన్నారు. ప్రపంచరక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
వ్యాధులు దూరం..
గోదావరిఖని: బీపీ నియంత్రణలో ఉంటేనే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని సింగరేణి ఆ రోగ్య అధికారి సుమన్ అన్నారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో అధిక రక్తపోటుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డాక్టర్లు అంబిక, రవి, భా స్కర్, మురళి, ప్రశాంత్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేస్తాం
ధర్మారం(ధర్మపురి): అకాలవర్షాలతో తడిసిన ధా న్యం కొనుగోళ్లపై రైతులు అధైర్యపడవద్దని, చివరిగింజ వరకూ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని విప్ కలిసి ధాన్యం కొనుగోళ్లపై వినతిపత్రం అందించారు. రైతుల సమస్యలను వివరించారు.