నిడగల్లు నడిచెళ్లాయ్‌! | - | Sakshi
Sakshi News home page

నిడగల్లు నడిచెళ్లాయ్‌!

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

నిడగల్లు నడిచెళ్లాయ్‌! సహకారం పుష్కలం!

టేకు దొంగల వెనుక ఎవరున్నారు?

అడారు టేకు చెట్ల దుంగలు..

నిడగల్లు సామిల్లులో ప్రత్యక్షం

కేసు నమోదైనా దర్జాగా కోతకు..

అన్నీ తెలిసినా.. అధికారుల మౌనం

కలపనూ వదలని ‘కంత్రీ తమ్ముళ్లు’

సాక్షి, పార్వతీపురం మన్యం:

పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో మాయమైన టేకు చెట్లు.. దుంగల రూపంలో సీతానగరం మండలం నిడగల్లు వద్ద ఓ సామిల్లులో ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు దీనిమీద ఒక కేసు గాని కేసు నడుస్తున్నా.. నియోజకవర్గ పెద్దలు మాత్రం దర్జాగా దానిని కోత కోసం మిల్లుకు తరలించడం గమనార్హం. ఎక్కడ అడారు.. ఎక్కడ నిడగల్లు! దగ్గరలో ఉన్న మిల్లులో అయితే ఎవరికై నా అనుమానం వస్తుందని కాబోలు... కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సీతానగరం మండ లం నిడగల్లు ఊరి చివరన చిన్ని సామిల్లుకు తరలించారు.ఆ కలపే నడిచి వెళ్లిందో.. లేదా కర్రి మహేష్‌ కు చెందిన ట్రాక్టర్‌లో రాత్రికి రాత్రి తరలించారో మరి! ఈ విషయం ఊరంతా కోడై కూస్తున్నా అధికారులకు తెలియకపోవడం విడ్డూరం.. వింత!! నియోజక వర్గానికి చెందిన ముఖ్యనేత అడిగీ అడగడంతోనే పార్వతీపురం, సీతానగరం మండలాల ‘తెలుగు తమ్ముళ్లు’ దగ్గరుండి పాఠశాలలకు సెలవు ఇచ్చిన మరుసటి రోజే ఏళ్ల కిందటినాటి టేకు చెట్లను కొట్టించి తీసుకువెళ్లిపోయారు. ఇంటి నిర్మా ణం కోసం.. ప్రభుత్వ స్థలంలో, పాఠశాల ఆవరణలో.. అటవీ శాఖ అనుమతి కూడా లేకుండా రాత్రికి రాత్రే చెట్లు నరికి తరలించుకోవడం గమనార్హం.

ఫిర్యాదుకు వెనకడుగు..

పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు నరికేసి తరలించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.గోపమ్మ రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో గత శుక్రవారం ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీన చెట్లు కొట్టివేశారని.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయా తులసమ్మ భర్త ఇచ్చిన సమాచారం మేరకు తాను సహచర ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించానని ఆమె చెప్పారు. 12 టేకు చెట్లను నరికించి తరలించుకుపోయారని ఫిర్యాదులో పేర్కొనగా.. రెండు రోజుల కిందట ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టిన తహసీల్దార్‌ సీహెచ్‌ సత్యనారాయణ 14 చెట్లు అని చెప్పడం గమనార్హం. మండలానికి చెందిన టీడీపీ నాయకులే దగ్గరుండి చేయించారని.. వారి పేర్లు సైతం పాఠశాల యాజమాన్య కమిటీకి తెలుసని గ్రామస్తులు చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందని అంటున్నారు. అంతా గ్రామ దేవత పండగ హడావిడిలో ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోయారని తెలుస్తోంది.

పత్రికల్లో కథనాలు వచ్చినంత వరకూ అధికారులు పరిశీలనకు రాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఏళ్ల నాటి, రూ.లక్షల విలువ చేసే టేకును తరలించినా.. అటవీ శాఖ స్పందన లేదు. కేసు నమోదైనా పోలీసుల నుంచి పురోగతి లేదు. అటవీశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని పరిశీలించినా.. అక్క డ నుంచి ముందుకు వెళ్లకపోవడం.. అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. విష యం బహిర్గతం అయినా.. కేసు నమోదైనా సరే... టేకు దుంగలను దర్జాగా సీతానగరం మండలం నిడగల్లు ఊరి చివరన ఉన్న సామిల్లుకు ట్రాక్టర్‌లో తరలించారు. వాటికి కోత పూర్తి చేశాక.. నామరూపాలు పోయాక.. తీరిగ్గా విచారణ ముందుకు తీసుకువెళ్తారేమో అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం కనీసం కలప కూడా కొనుగోలు చేసుకోలేని పేదరికంలో టీడీపీ పెద్దలు ఉన్నారని విమర్శిస్తున్నారు.

టేకు చెట్ల దొంగల వెనుకున్న వారిని పట్టుకొని శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు రామస్వామి డిమాండ్‌ చేశారు. అడారు ఎంపీ పీ స్కూల్‌ ఆవరణలో దొంగతనంగా నరికిన 14 టేకు చెట్లను సోమవారం పరిశీలించారు. దీని వెనుక చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారని అను మానం వ్యక్తం చేశారు. వెంటనే వారిని శిక్షించాల ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నా యకులు పాలమెట్ట రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.వరాలు పాల్గొన్నారు.

అడారు గ్రామ పాఠశాల ఆవరణలో ఏళ్లుగా పెంచుతున్న టేకు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement