పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదుల పరి ష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఐటీడీ ఏ పీఓఆర్.వైశాలి, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ దిలీప్‌కళ్యాణ్ చక్రవర్తితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 72 వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఇందులో పీజీఆర్‌ఎస్‌కు 50, రెవెన్యూ క్లినిక్‌కు 20 అర్జీలు వచ్చాయి. పెండింగ్ సమస్యలను శాఖల వారీగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఫీల్డ్ పర్యటనల ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. అర్జీదారులతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పారు. అర్జీలు పెండింగ్‌లో లేకుండా, రీ ఓపెన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్‌ఎల్ ఏ గడువులు దాటకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని ఇలా...
●జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మాణం చేస్తున్న లబ్ధి దారులకు బిల్లులు చెల్లించాలని కోరుతూ గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ అర్జీ అందజేశారు. అలాగే పార్వతీపురం మండలంలోని అడారు గ్రామ పాఠశాలలోని టేకు చెట్లను అక్రమంగా నరికి తరలించి న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో అర్జీని రంజిత్ కుమార్ అందజేశారు.
●వీరఘట్టం మండలం నీలానగరం గ్రామానికి చెందిన బి.ఈశ్వరరావు తన తండ్రి వీఆర్‌ఓగా విధులు నిర్వహించి మృతి చెందారని తన తండ్రి ఉద్యో గం వారసుడైన తనకు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశాడు.
గడువులోగా సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురం రూరల్: నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పది ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, వేధింపులు, అత్తారింటి సమస్యలు, నకిలీ పత్రాలు, ఆన్‌లైన్ మోసాలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు వాస్తవాలుగా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకున్న నివేదికను ఎస్పీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్సై శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 7 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 7 వినతులు వచ్చాయి. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అనసధద్ర ఈఎంఆర్‌ఎస్ నుంచి మెళియాపుట్టి ఈఎంఆర్‌ఎస్‌కు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని నేతల గ్రామానికి చెందిన చరిష్మా కోరింది. కోదుల వీరఘట్టం గ్రామానికి కాలువలు నిర్మించాలని గేదెల నరేష్ కోరారు. ఆయిల్ ఇంజిన్ స్ప్రేయర్లు ఇప్పించాలని పెద్దూరుకు చెందిన నిమ్మక నగేష్ వినతి ఇచ్చారు. గజపతినగరానికి చెందిన కమల రేషన్ కార్డు ఇప్పించాలని కోరింది. అంన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీలో ఎస్టీకి బదులుగా ఎస్‌సీ రిజర్వేషన్ వచ్చిందని, మార్పు చేయాలని దశమంతుపురానికి చెందిన
నగేష్ కోరారు. కార్యక్రమంలో పీహెచ్‌వో ఎస్.వి గణేష్, డిప్యూటీఈఓ నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని తదితరులు పాల్గొన్నారు.


