సీతంపేట: మండలంలోని జి.గుమ్మడ గ్రామానికి చెందిన ఆరిక సోమయ్య (63) అనే వృద్ధు డు మెట్లపై నుంచి జారిపడి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు దోనుబాయి ఏఎస్సై త్రినాథరావు తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి మెట్లు ఎక్కుతుండగా జారి పడడంతో సోమ య్య తలకు బలమైన గాయమైందన్నారు. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించి ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
సీతంపేట: స్థానికంగా నిర్వహిస్తున్న ఐటీడీఏ పెట్రోల్ బంకులో సోమవారం పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం వారపు సంత కావడంతో ఎక్కువ మంది వాహనదారులు సీతంపేటకు రావడం, పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో బయట మార్కెట్‌లో కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలియజేశారు.
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, సోమవారం ప్రారంభించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఈ శిబిరం నిర్వహిస్తారని, ఒక వారం ఆయుర్వేదం, మరో వారం హోమియోపతి సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపు లక్ష్యమని పేర్కొన్నా రు. డీఎంహెచ్‌ఓ భాస్కరరావు, జిల్లా ఎన్‌సీడీ అధికారి డా.జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.
సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రి రోగులతో సోమవారం కిటకిటలాడింది. మొత్తం 293 మంది ఓపీ కోసం రాగా వారిలో 46 మంది వరకు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నా రు. అత్యవసరమైన వారిని ఇన్‌పేషెంట్లుగా ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు సంబంధిత వైద్యాధికారులు తెలిపారు.


