పట్టణ వాసుల్లో విస్తరణ గుబులు
చిలకపాలెం–రాయగడ రోడ్డు విస్తరణకు సన్నాహాలు పార్వతీపురంలో నాలుగువరుసల రోడ్డు విస్తరణకు ఏర్పాట్లు వ్యాపారుల్లో ఆందోళన రోడ్డు విస్తరణను బూచిగా చూపిస్తూ డబ్బుల దందా
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ప్రస్తుతం పార్వతీపురం పట్టణంలో బైపాస్ రహదారి ఉంది. నాలుగు రోడ్ల రహదారిని బైపాస్‌కు అనుసంధానం చేస్తారా? లేక పట్టణ కేంద్రం నడిబొడ్డు నుంచి నాలుగు లైన్లు రహదారి నిర్మిస్తారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రహదారి ప్రతిపాదన వచ్చినప్పుడు.. వ్యాపారులు, ఇళ్ల సముదాయాల వారు నష్టపోకూడదన్న ఉద్దేశంతో పట్టణ వెనుక మార్గం మీదుగా రింగురోడ్డు ప్రతిపాదనను తీసుకొచ్చారు. అటు వెంకంపేట నుంచి చాకలిబెలగాం మీదుగా.. ఇటు అడ్డాపుశీల వైపు బైపాస్ చేయాలని భావించారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం అటువంటి ఆలోచనేమీ లేదని.. పట్టణం మీదుగానే రహదారి విస్తరణ ఉంటుందని టీడీపీ నాయకులు నర్మగర్భంగా చెబుతున్నారు. ఇదే బూచిని చూపి.. వ్యాపార వర్గాలను బెదిరిస్తున్నట్లు కూడా పట్టణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందికి అభయమిస్తూ.. పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు వినిపిస్తోంది
పీపీపీ విధానంలో రహదారులను అభివృద్ధి చేస్తే టోల్ బాధ కూడా ఉంటుంది. ఇప్పటికే మానాపురం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ గేటుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటుగా రాకపోకలు సాగిస్తున్న వారికి అదనపు భారమవుతోంది. ఇప్పుడు మరలా ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారులను నిర్మిస్తే.. మరో టోల్ మోత తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లా కేంద్రమైన తర్వాత పార్వతీపురం పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాకు ప్రధాన కేంద్రం కావడంతో పెద్ద మాల్స్ వస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపార కేంద్రంగా మారుతోంది. చిరువ్యాపారుల నుంచి పెద్ద కార్పొరేట్ సంస్థలతో కలిపి రోజూ రూ.కోట్లలో వ్యాపారం సాగుతోంది. వీటిలో రాయగడ మార్గంలోని ప్రధాన రహదారి వెంబడే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు వీరందరికీ.. రహదారిని ఆనుకుని ఉన్న ఇళ్ల యజమానులకు కొత్త గుబులు పుట్టుకొస్తోంది. ఇప్పుడున్న రహదారి నాలుగు వరుసలుగా మారనుంది. పీపీపీ విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
●చిలకపాలెం–రాయగడ (రామభద్రపురం, బొబ్బిలి, సీతానగరం మీదుగా) రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మొత్తం 130 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి పార్వతీపురం మీదుగానే వెళ్లనుంది. ఈ విస్తరణ పనులు ప్రైవేట్–పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్నారు. ఇది పూర్తయితే ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ విస్తరణ పనులు మన్యం జిల్లా వాణిజ్య, రవాణా అభివృద్ధికి దోహదపడతాయని చెబుతున్నారు.
●కళింగపట్నం–శ్రీకాకుళం–పార్వతీపురం(113 కిలోమీటర్ల మేర) రహదారిని కూడా పీపీపీ విధానంలోనే విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది.
విస్తరణ సరే.. వారి పరిస్థితేమిటి?
పార్వతీపురం మీదుగా ఇప్పటి వరకు రెండు వరుస ల రహదారులే ఉన్నాయి. కొత్తగా నిర్మించే నాలుగు లైన్ల రహదారుల్లో డివైడర్లు పోను.. ఇరువైపులా 11 మీటర్ల వరకు బీటీ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. 30 వార్డులుగా విస్తరించి ఉన్న జిల్లా కేంద్రం, పార్వతీపురం పట్టణంలో సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. జిల్లా ముఖద్వారం కావ డంతో వివిధ పనుల నిమిత్తం వచ్చేవారి సంఖ్య నిత్యం లక్షల్లో ఉంటోంది. దీంతో ఇరుకిరుకు మార్గాల్లో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు.
●ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రహదారి వెంబడి వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే విజయ్‌చంద్ర తీసివేయించారు. దీంతో సుమారు 500 కుటుంబాలు వీధిన పడ్డా యి. దీనిపై అప్పట్లో వారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అప్పటి కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి కూడా చేశారు.
●తొలిసారి 2002 ఫిబ్రవరిలో రహదారి విస్తరణ చేపట్టారు. అప్పట్లో వందలాది మంది వ్యాపారులు, సమీప ఇళ్ల యజమానులు రోడ్డున పడ్డారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఉదంతాలున్నాయి.
●గతంలో సబ్ కలెక్టర్ శ్వేతామహంతి సమయంలోనూ రహదారి వెంబడి చిరువ్యాపారులను తొలగించే ప్రయత్నం చేశారు.
●మరలా ఇప్పుడు పట్టణం మీదుగా రహదారి విస్తరణ జరిగితే.. ఎంతమంది సహకరిస్తారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు తమ వ్యాపారాలు పోతాయేమోనని ఆందోళన వారిలో ఉంది.
పట్టణ వాసుల్లో విస్తరణ గుబులు
పట్టణ వాసుల్లో విస్తరణ గుబులు
పట్టణ వాసుల్లో విస్తరణ గుబులు
పట్టణ వాసుల్లో విస్తరణ గుబులు


