శ్రీవారితో ఆటలా? | - | Sakshi
Sakshi News home page

శ్రీవారితో ఆటలా?

Feb 10 2026 7:55 AM | Updated on Feb 10 2026 7:55 AM

శ్రీవారితో ఆటలా?

శ్రీవారితో ఆటలా?

శ్రీవారితో ఆటలా?

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

శత్రుచర్ల పరీక్షితరాజు

జియ్యమ్మవలస రూరల్‌:

ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, ప్రజలు ఆ ముగ్గురిని ఛీ కొడుతున్నా వారికి ఏమాత్రం సిగ్గనిపించడం లేదు. శ్రీవారి లడ్డూ వివాదానికి ఆజ్యం పోస్తున్న కూటమికి ఆత్మాభిమానం లేద ని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభు త్వ పాలన పూర్తిగా ఫెయిల్‌ అయిందని హింసాత్మక ఘటనలతో రాష్ట్రం అధోగతి పాలన పట్టిస్తున్న పరిస్థితుల్లో ప్రజలంతా ఛీ కొడుతున్నారన్నారు. ఇదే అదునుగా చంద్రబాబు నాయుడు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో అనేక అబద్ధాలు ఆడుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగజారారన్నారు. శ్రీవారి లడ్డూలో ఎలాంటి యానిమల్‌ ఫేట్‌ లేదని సిట్‌, సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్‌ఐ నివేదికలను ఇచ్చినా కేవలం వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీవారి లడ్డూకు వాడుతున్న నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వు కల్తీ జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి్‌, అప్పటి తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌ రెడ్డి ఈ కల్తీకి సూత్రధారులన్న తప్పుడు ప్రచారంతో యావత్‌ ప్రపంచంలోని హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, ఈ పాపం ఊరికే పోదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి ప్రభుత్వ పాలన, అభివృద్ధి పక్కదారిని పట్టిస్తున్నారని, వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేసి హింసను ప్రోత్సహిస్తూ బరితెగిస్తున్నారన్నా రు. శ్రీవారి ప్రసాదంతో పరిహాసానికి ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. చివరకు టాయిలెట్‌ శుభ్రం చేసే కెమికల్స్‌ కూడా శ్రీవారి ప్రసాదంలో కలుపుతున్నారని మీరు, మీ పచ్చ మీడియా అబద్ధాలు చెబుతూ నీచానికి దిగజారి పోయారని మండిపడ్డారు.

శ్రీవారికి క్షమాపణ చెప్పండి

ఇప్పటికై నా తిరుమల శ్రీవారికి క్షమాపణ చెప్పి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయకుండా ముఖ్యమంత్రి హోదాను నిలబెట్టుకోవాలని హిత వు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కోట రమేష్‌, జెడ్పీటీసీ సభ్యురాలు శశికళ, వైస్‌ ఎంపీపీ సంపత్‌ కుమార్‌, బలగ వెంకటరమణ, లోలుగు నారాయణరావు, కృష్ణ, రామకృష్ణ, పాపారావు, రవి, అల్లు రమణమ్మ, ఈశ్వర రావు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement