కదం తొక్కిన అంగన్‌వాడీలు
నిర్బంధాలను అధిగమించి..
సాక్షి, పార్వతీపురం మన్యం:
జీతాల పెంపు సమస్య పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు కదం తొక్కారు. అంగన్‌వాడీ వర్క ర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశా రు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని.. మినీల ను మెయిన్ వర్కర్లుగా మార్చాలని.. కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ గేటు వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. జీతాలు పెంచడంతో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి అమరవేణి, కార్యదర్శి జి.జ్యోతిలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావు, శ్రామిక మహిళా నాయకులు ఇందిర, జిల్లాలోని 10 ప్రాజెక్టుల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.
ఎక్కడికక్కడ నిర్బంధం
రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అంగన్‌వాడీలు తలపెట్టి న ధర్నా కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకం కలిగించారు. యూనియన్, సీఐటీయూ నాయకులను గృహ నిర్బంధం చేశారు. జిల్లా కేంద్రానికి బయల్దేరిన వర్కర్లను, నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులు, ఆటోల్లో వస్తున్న వారిని మార్గంమధ్యంలోనే నిలుపుదల చేసి వెనక్కి పంపారు. కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీ
సులు మోహరించారు. నిర్బంధాలను అధిగమించి అంగన్‌వాడీలు భారీగా నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు.
కదం తొక్కిన అంగన్‌వాడీలు


