త్రుటిలో తప్పిన ప్రమాదం
గరుగుబిల్లి: పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి సినీఫక్కీలో పల్టీకొట్టింది. ఆదివారం ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం వెళ్లి తిరు గు ప్రయాణంలో పార్వతీపురం వస్తుండగా మార్గమధ్యంలో తోటపల్లి శ్రీ కోదండరామాలయం సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయన సరక్షితంగా బయటపడ్డారు.
కుక్కల దాడిలో
పది గొర్రెపిల్లల మృతి
వంగర: మండలకేంద్రంలో కుక్కలు ఆదివారం దాడిచేయడంతో పది గొర్రెపిల్లలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన పడాల గంగులు ఇంటి సమీపంలోని గొర్రెల షెడ్డులోకి కుక్కలు చొరబడి దాడిచేశాయి. ఈ దాడిలో పది గొర్రెపిల్లలు మృతిచెందడంతో బాధితుడు లబోదిబో మంటున్నాడు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో వారం రోజుల క్రితం 20 గొర్రె పిల్లలను కుక్కలు దాడిచేసి హతమార్చాయి. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
రామభద్రపురం: మండలంలోని తారాపురం వద్ద ఆదివారం బైక్ ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా రమణ తన పాడిపశువులను మేతకు తోలుకుని వెళ్లి మేత తర్వాత తిరిగి ఇంటికి తొలుకోస్తుండగా వెనుకనుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్రవాహనదారు ఢీ కొట్టి ఆపకుండా పరారయ్యాడు. దీంతో రమణ తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి భార్య సాయి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
త్రుటిలో తప్పిన ప్రమాదం


