సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ | - | Sakshi
Sakshi News home page

సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ

Dec 1 2025 7:28 AM | Updated on Dec 1 2025 7:28 AM

సమాజ

సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ

సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ

పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు గురజాడ విశిష్ట పురస్కారం గురజాడ రచనలు స్ఫూర్తినిచ్చాయి..: హైకోర్టు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురజాడ స్వగృహంలో మహాకవికి ఘన నివాళి గురజాడ వారసులు, ఉత్తమ కవితా పురస్కార గ్రహీతలకు సత్కారం

విజయనగరం టౌన్‌: సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో తనదైన శైలిలో రచనలు చేసిన సమాజాన్ని చైతన్య పరిచిన మహనీయుడు గురజాడ అప్పారావు అని, అటువంటి మహనీయుని 110వ వర్ధంతిలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని గురజాడ విశిష్ట పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ పేర్కొన్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య సాహితీ చైతనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక క్షత్రియ కల్యాణ మండపం ఆవరణలో గురజాడ విశిష్ట పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. వర లక్ష్మి త్యాగరాజ సంగీత కళాశాల, సూర్యతేజ డాన్స్‌ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకా లు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను, గురజాడ వారసులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. శ్రీ సాయి ఫౌండేషన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మన్నశెట్టి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు గురజా డ విశిష్ట పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగ దుతో ఘనంగా సత్కరించారు. సమాఖ్య కోశాధికా రి డాక్టర్‌ ఎ.గోపాలరావు ప్రశంసాపత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం గురజాడ విశిష్ట పురస్కా ర గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ గురజాడ వంటి మానవతా మూర్తి పుట్టడం వలన సమానత్వాన్ని పొందుతున్నామన్నారు. మహిళలను, చిన్నారులను, సామాన్యుల ను ఆయన ఆదరించారని, దేశమును ప్రేమించుమన్నా.. అంటూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న వారికి హితబోధ చేశారన్నారు. భాష గొప్ప తనాన్ని వివరించిన మహనీయుడన్నారు. ముత్యాల సరాలను తయారు చేశారని, మనుషులంతా మనుషులుగా బతకాలని, దేశమంటే మట్టికాదు.. మనుషులని, దేశాన్ని ప్రేమిస్తే సమాజం బాగుంటుందని చాటి చెప్పారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్‌ సిహెచ్‌.మానవేంద్రనాథ్‌రాయ్‌ మాట్లాడుతూ మహాకవి రాసిన గేయాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. సొంతలాభం కొంతమానుకుని పొ రుగు వారికి సాయం చేయమన్నటువంటి వాఖ్యా లు ఎంతో విలువైనవన్నారు. సాంఘిక దురాచారాలను ఎలా రూపు మాపాలి, వాటిని ఏ విధంగా సంస్కరించాలని ఆలోచన చేసి కన్యాశుల్కం రూపొందించారన్నారు. ప్రజల మధ్యలోకి నాటకం రూపంలో తీసుకువెళ్లి ఆలోచన రేకెత్తించారన్నారు. అటువంటి మహనీయునికి మనమంతా రుణపడి ఉన్నామన్నారు.

ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ మాట్లాడుతూ 130 ఏళ్లకి పూర్వమే సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు మహాకవి చేపట్టిన కృషి ఎనలేనిదన్నారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసి న ఇనాక్‌ని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కవితా పోటీలలో విజేతల వివరాల ను డాక్టర్‌ జక్కు రామకృష్ణ వెల్లడించారు. పొత్తూరి సీతారామరాజు (కాకినాడ), సునీత గంగవరపు, చిలకలూరిపేట (పల్నాడు), మహమ్మద్‌ అప్సర వలీషా, కోనసీమ (ద్వారపూడి), ఇనపకుర్తి చిన సత్యన్నారాయణ (విజయనగరం), చెళ్లపిళ్ల శ్యామ ల (విజయనగరం) తదితరులకు గురజాడ ఉత్తమ కవితా పురస్కారాలను, అదే విధంగా గురజాడ రచనలపై నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి ముందు మహాకవి గుర జాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహాకవి ఇంటి నుంచి గురజాడ దేశభక్తి గీతాలాపన చేస్తూ ర్యాలీగా బయలుదేరి కాంస్య విగ్రహం వద్ద పూలమాలలను సమర్పించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శు లు డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్‌ ల నేత్రత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి, నవసాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్‌వి.సూర్యప్రకాష్‌రావు (చైన్నె), సభ్యులు ఎం.అనిల్‌ కుమార్‌, మేకా అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ 1
1/1

సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement