బహుపరాక్..!
ప్రాణాంతక వ్యాధితో..
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీ ఎయిడ్స్‌వ్యాఽధి పట్ల ఒకప్పుడు సమాజంలో వివక్ష ఉండేది. అరోగులు ఉన్న ఛాయలకు కూడా వెళ్లడానికి ఇష్టపడేవారుకాదు. అంతేకాకుండా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వచ్చేవారు కాదు. హెచ్‌ఐవీ రోగులను కలవడానికి కానీ, వారితో మాట్లాడడానికి కాని ఇష్టపడేవారు కాదు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగుల పట్ల గతంలో కంటే అవగాహన వచ్చింది. హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పట్ల ఇంకా అవగాహన రావాల్సి ఉంది.
సన్మార్గమే ఉత్తమం
హెచ్‌ఐవీ వచ్చిన తర్వాత బాధపడేకంటే హెచ్‌ఐవీ బారిన పడకుండా ఉండడం మంచిది. చెడుఅలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవడం ద్వారా హెచ్‌ఐవీ బారిన పడకుండా ఉండవచ్చు. హెచ్‌ఐవీ సోకిందంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఐసీటీసీ సెంటర్‌లో హెచ్‌ఐవీ పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణ అయినవారికి ఏఆర్‌టీ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసి మందులు అందిస్తారు. ఒకసారి మందుల వాడకం ప్రారంభించిన తర్వాత మధ్యలో మానివేయకూడదు. మందులు మధ్యలో మానివేస్తే వారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుంది.
ఏఆర్‌టీ కేంద్రంలో 6582 మందికి చికిత్స
జిల్లాలోని ఏఆర్‌టీ కేంద్రంలో 6582 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పురుషులు 2836 మంది, మహిళలు 3707 మంది, పిల్లలు 39 మంది ఉన్నారు. 2008 నుంచి ఆక్టోబర్ నెలాఖరు నాటికి 13,897మంది హెచ్‌ఐవీ రోగులు నమోదయ్యారు.
జిల్లాలో చికిత్స అందించే కేంద్రాల వివరాలు
జిల్లాలో సమగ్ర, పరీక్ష కేంద్రా(ఐసీటీసీ)లు 11 ఉన్నాయి. అదేవిధంగా పీహెచ్‌సీల్లో 65 ఐసీటీసీలు ఉన్నాయి. అలాగే రక్తనిధి కేంద్రాలు జిల్లాలో 9 ఉన్నాయి. రక్త నిల్వ కేంద్రాలు 8 ఉన్నాయి. రక్తసేకరణ వాహనం ఒకటి ఉంది. జిల్లాలో ఏఆర్‌టీ కేంద్రాలు రెండు ఉన్నాయి. లింక్ ఏఆర్‌టీ కేంద్రాలు 7 ఉన్నాయి. సుఖవ్యాధి చికిత్స కేంద్రాలు రెండు ఉన్నాయి. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు 6 ఉన్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. హెచ్‌ఐవీ ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్‌ఐవీ సోకిన వారికి ఎక్కడ చికిత్స అందిస్తారనే దానిపై అవగాహన కల్పిస్తున్నాం.ీ పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ పరీక్షలతో పాటు హెచ్‌ఐవీపై కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీపై అవగాహన కల్పించుకోవాలి. – డాక్టర్ కె.రాణి,
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి
ఎయిడ్స్ పట్ల అవగాహన అవసరం
జిల్లాలోని ఏఆర్‌టీ కేంద్రంలో
రోగులు 6582 మంది
హెచ్‌ఐవీ పరీక్ష చేసే ఐసీటీసీ
కేంద్రాలు 77
నేడు ప్రపంచ ఎయిడ్స్
నివారణ దినం
బహుపరాక్..!
బహుపరాక్..!
బహుపరాక్..!


