గాయపడిన వ్యక్తి మృతి
భామిని: మండల కేంద్రానికి చెందిన బొమ్మాళి సుదర్శన్(40) ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు విశాఖ కేజీహెచ్‌లో వైద్యసేవలు అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలు..
బాడంగి: స్థానిక పెద్దవీధికి చెందిన మరడాన పాపమ్మ(76) కాలిన గాయాలతో విజయనగరం ఆస్ఫత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. వృద్ధురాలు తనఇంటిలో శనివారం సాయంత్రం వంటచేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకొంగుకు నిప్పంటుకుని శరీరం కాలిపోగా మెరుగైనచికిత్సకోసం విజయనగరం సర్వజన ఆస్ఫత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారని ఎస్సై చెప్పారు. కుమారుడు అప్పల నాయుడి ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసుదర్యాఫ్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


