 
															దత్తివలసలో ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని చింతలబెల గాం పంచాయతీ దత్తివలసలో గురువారం సాయంత్రం ఏనుగులు సంచరించాయి. ఉద యం గవరమ్మపేటలో ఉన్న ఏనుగులు సాయంత్రం దత్తివలసలోని వరి పొలాల్లోకి చేరాయి. వరి, అరటి పంట దశలో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఏనుగుల సంచారంతో భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
భామిని: ఢిల్లీలో ఇస్రో నిర్వహిస్తున్న స్పేస్ వర్క్‌షాపులో పాల్గొనేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు పిలుపు అందింది. వారిలో భామిని మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఎస్.నిహారిక ఉన్నట్టు ప్రిన్సిపాల్ జి.బాబురావు గురువారం తెలిపారు. వచ్చేనెల 5న గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బాలిక చేరుకుంటుందని పేర్కొన్నారు. మూడురోజుల అనంతరం తిరిగి 9వ తేదీన విజయవాడ చేరుకుంటుందని డీఈఓ రాజ్‌కుమార్ తెలిపారన్నారు. బాలికను పాఠశాల సిబ్బంది అభినందించారు.
గరుగుబిల్లి: మోంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్టులో 9,307 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తివేసి 9,307 క్యూసెక్కుల వరద నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.53 టీఎంసీలకు 1.91 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలు వేస్తే సహించేది లేదు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వ్యర్‌ాధ్యలు కలెక్టరెట్ ప్రాంగణంలో వేస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. ‘కంపుకొడుతున్న కలెక్టరేట్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని గురువారం ఆదేశాలిచ్చారు. ప్రతి నెల మూడవ శనివారం తప్పనిసరిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సువర్ణముఖి, వేగాతి నదుల నుంచి గురువా రం 24,600 క్యూసెక్కులనీరు ప్రాజెక్టులో చేరుతుండగా, ఎనిమిది గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 63.71 మీటర్ల మేర నీటిమట్టం నమోదైందని ఏఈ నితిన్ తెలిపారు.
 
							దత్తివలసలో ఏనుగుల గుంపు
 
							దత్తివలసలో ఏనుగుల గుంపు
 
							దత్తివలసలో ఏనుగుల గుంపు
 
							దత్తివలసలో ఏనుగుల గుంపు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
