 
															తెలుగు మహాసభలకు నాయుడి కార్టూన్ ఎంపిక
గరుగుబిల్లి: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పల్ల పరిశినాయుడు పంపించిన కార్టూన్ ప్రత్యేక బహుమతికి ఎంపికై ంది. 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరుచ్యువల్ సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న మూడవ తెలుగు మహసభల్లో భాగంగా నిర్వహించిన ‘కార్టూన్‌లతో తెలుగు వికాసం’ పోటీల్లో విజేతలను ప్రకటించారు. తేనెలొలికే తెలుగు భాషను పరిరక్షిస్తుండడంపై కందుకూరు వీరేశలింగం పంతులు, గురుజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి తదితర తెలుగు కవులు ఆనందిస్తున్నట్లున్న పరిశినాయుడు వేసిన కార్టూన్ న్యాయనిర్ణేతలను ఆలోచింపజేసింది. తెలుగు భాషాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించనున్న తెలుగు మహసభల్లో కార్టూన్ విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
విజయనగరం టౌన్: సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు ఎస్‌ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్పీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్న ట్టు మైనారీటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కె.కుమారస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో శిక్షణ సాగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సీఈడీఎం కార్యాలయం, భవానీపట్నం, విజయవాడ– 520012 చిరునామాకు బయోడేటాను పంపించాలన్నారు. వివరాలకు స్థానిక మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, ఫోన్– 0866– 2970567ను సంప్రదించవచ్చన్నారు.
 
							తెలుగు మహాసభలకు నాయుడి కార్టూన్ ఎంపిక

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
