 
															●పాఠశాలకు బీటలు.. రచ్చబండపై చదువులు
రచ్చబండపై విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు
బీటలు వారిన గోళ్లవలస ఎంపీపీ స్కూల్ భవనం
కురుపాం మండలం గుమ్మిడిగూడ పంచాయతీ పరిధిలోని గోళ్లవలస గ్రామ ప్రాథమిక పాఠశాల భవనం తుఫాన్ వర్షాలకు పూర్తిగా కారిపోతోంది. పైకప్పు పెచ్చులూడి రాలిపోతోంది.
మరోవైపు గోడలు బీటలు వారాయి. కూలిపోయే ప్రమాదం ఉండడంతో పాఠశాల హెచ్‌ఎం సర్పంచ్ శెట్టి సురేష్ సహకారంతో గ్రామంలో ఉన్న రచ్చబండపై విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – కురుపాం
 
							●పాఠశాలకు బీటలు.. రచ్చబండపై చదువులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
