 
															విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన పోటీలు
చికెన్
పార్వతీపురం రూరల్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు, ఆయా పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది ‘‘లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర’’ అనే అంశంపై వక్తృత్వం, వ్యాసరచన పోటీలు ఇటీవల నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించగా, గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీసీఆర్‌బీ సీఐ పర్యవేక్షణలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వ్యాస రచన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని రాశారు. అదేవిధంగా వక్తృత్వం పోటీలో పాల్గొన్నవారు తమ ఆలోచనలను స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, ప్రేరణాత్మకంగా వ్యక్తపరిచారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేయనున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
