 
															సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
రామభద్రపురం: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో జీవనరాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాలను గురువారం ఆమె సందర్శించిన అనంతరం స్థానిక పీహెచ్‌సీకి వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఇంటికీ వెళ్లి మరిగించిన నీరు తాగేలా అవగాహన కల్పింలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే సుఖప్రసవాలు జరుగుతాయని, గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు పోగొట్టుకోకూడదని హితవు పలికారు. సిబ్బంది కూడా గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి దిలీప్‌కుమార్, సీహెచ్‌వో రాజు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో జీవనరాణి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
