 
															కూలిపోయిన ఇళ్లు
సీతానగరం: మోంథా తుఫాన్ కారణంగా నాలుగురోజులుగా కురిసిన వర్షానికి సీతానగరం మండలంలోని బక్కుపేటలో ఒంటరి మహిళ చుక్క లక్ష్మి పూరిల్లు గోడలునాని పూర్తిగా కూలిపోవడంతో భోరున విలపించింది. బుధవారం సాయంత్రం ఇల్లు కూలి పోవడంతో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్‌కు ఫిర్యాదు చేసింది. దిక్కులేక అవస్థలు పడుతూ తలదాచుకుంటున్న ఇల్లు వర్షానికి కూలిపోవడంతో భోరున విలపించింది. ఇల్లు కూలిపోయిందని వీఆర్వో ద్వారా తెలుసుకున్న తహసీల్దార్ మాట్లాడుతూ కూలిన ఇంటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలియజేశారు.
గుర్లలో..
గుర్ల: మోంథా తుఫాన్ ప్రభావంతో గుర్ల మండలంలోని తాటిపూడిలో పెంకుటిళ్లు ముందుభాగాలు పూర్తిగా తడిచిపోయి కుప్పకూలాయి. తాటిపూడికి చెందిన గూడేల లావణ్య, లక్ష్మణరావు, గేదెల పాపారావు, గూడేల నరసయ్యమ్మ, పొతిన శ్రీరాములుకు చెందిన పెంకుటిళ్ల ముందుభాగం ఒక్కసారిగా పడిపోవడంతో వారు భయాభ్రాంతులకు గురయ్యారు. పెంకిటిళ్ల ముందుభాగం పడిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు చెబుతున్నారు. ద్విచక్ర వాహనంపై కర్రలు, పెంకులు పడడంతో పాక్షికంగా దెబ్బతింది. పడిపోయిన ఇళ్లను తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి పరిశీలించారు. ఆ ఇళ్లలో ఉన్నవారిని సచివాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉండాలని సూచించారు.
 
							కూలిపోయిన ఇళ్లు
 
							కూలిపోయిన ఇళ్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
