పాఠశాలలకు సెలవు
మరోవైపు తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లోనూ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. రైతులను, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 27, 28, 29వ తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశారు. నదులు, వాగులు, వంకలు ఎవరూ దాటకుండా మైక్‌లు, దండోరా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పాఠశాలలకు సెలవు


