
విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
● ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్
పార్వతీపురం టౌన్: ఎగ్జామ్స్ పేరుతో ఫీజుల దోపిడీకి పాల్పడితే, ఆ విద్యా సంస్థల యాజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయిలో ల్యాబ్ సౌకర్యం లేని విద్యాసంస్థల్లో ఆచరణాత్మక పరీక్షల సెంటర్లను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి వై నాగేశ్వరరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎగ్జామ్స్ పేరుతో విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు చరణ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.